తాడేపల్లిగూడెం యాగర్లపల్లి UHC వెనుక ఈ నెల 14న రాత్రి పెరుమాళ్ల నాగమణి (76) హత్యకు గురైన సంఘటనలో నిందితుడు దగ్గుపల్లి ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం కోసం తలపై సిమెంట్ రాయితో కొట్టి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు డీఎస్పీ డి.విశ్వనాథ్ గురువరాం తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.3,45,500ల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.