ఏలూరు జిల్లాలో ఆటిజంపై అవగాహన

ఏలూరు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ఆధ్వర్యంలో, ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా మాదేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. పి.హెచ్.సి డాక్టర్ పి.వేలంగిని మాట్లాడుతూ ఆటిజం ఒక వ్యాధి కాదని, మెదడు వికాసంలో మార్పుల వల్ల కలిగే ప్రత్యేక స్థితి అని వివరించారు. పిల్లలలో మాటలు ఆలస్యం కావడం, తోటివారితో కలవలేకపోవడం, ఒకే పనిని పదేపదే చేయడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్