భీమడోలు మండలం సూరప్పగూడెం సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని వాటిని తొలగించే పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివాజీ గురువారం తెలిపారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలసానిపల్లి, సూరప్పగూడెం గ్రామాలకు సరఫరాలో అంతరాయం ఉండనుందని ఈఈ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు.