ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్ర రావును దెందులూరు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి వైసీపీ నాయకులతో కలిసి గురువారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న వరుస పరిణామాలతో పాటు రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలను వివరించారు. అనంతరం లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు.