దెందులూరు: రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

రాష్ట్రంలో సోషల్ మీడియా ప్రచారాలతో ఏర్పడిన పెట్రోల్ కృత్రిమ కొరత నేపథ్యంలో, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల కోసం ప్రత్యేకంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల తాసిల్దారుల పర్యవేక్షణలో వ్యవసాయ అధికారుల ద్వారా ఇంధన కూపన్లు అందించి, వారికి అసౌకర్యం కలగకుండా చూశారు. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మి అవసరానికి మించిన నిల్వలు కొనుగోలు చేయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్