ఉండవల్లిలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుని ఆయన నివాసంలో శుక్రవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి, పలు రాజకీయ అంశాలపై నారా లోకేష్ తో చర్చించారు.