దెందులూరు: ఆర్వోబీలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ.

ఎంపీ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఉంగుటూరు మండలం కైకరం, దెందులూరు మండలం కొత్తగూడెంలలో ఆర్వోబీల (రోడ్ ఓవర్ బ్రిడ్జిలు) నిర్మాణం కోసం రైల్వే శాఖ భూసేకరణకు ప్రిలిమినరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కైకరం ఎల్సీ నెంబర్ 364 వద్ద 19 సర్వే నెంబర్లలో 6.875 ఎకరాలు, కొత్తగూడెం ఎల్సీ నెంబర్ 355 వద్ద 18 సర్వే నెంబర్లలో 5.314 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఈ భూసేకరణపై ఏవైనా అభ్యంతరాలుంటే, సంబంధిత భూయజమానులు నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోగా తెలియజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్