ప.గో జిల్లా దెందులూరు సమీపంలోని పెదవేగి ఒకప్పుడు రాజధానిగా ఉండేదని మీకు తెలుసా? 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు విశాఖపట్టణం నుంచి ప్రకాశం వరకు పాలించిన తూర్పు చాళుక్యుల రాజధాని పెదవేగే. ఇక్కడ తవ్వకాలు జరిపితే పురాతన చరిత్ర వెలుగులోకి వస్తుందంటున్నారు స్థానికులు. ప్రతి రాయి ఓ కథ చెబుతుందని, ప్రతి గోడ ఓ చారిత్రక మూల్యం కలిగి ఉంటుందని ప్రతీతి.