భీమవరం మానవత శాఖ ఆధ్వర్యంలో, శీతాకాలం పురస్కరించుకుని బుధవారం రెండు ప్రాంతాలలో పేద వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, నిరుపేదలు, అభాగ్యుల కళ్ళల్లో ఆనందాలు చూడాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరూ చేతనైన సహాయం అందించాలని బుద్ధరాజు వెంకటపతి రాజు, ఇందుకూరి ప్రసాదరాజులు పిలుపునిచ్చారు. అల్లూరి శివాజీ రాజు సౌజన్యంతో 50 రగ్గులు ఇందిరమ్మ కాలనీ, ఫుట్ పాత్ ల మీద జీవించే అభాగ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, రంగరాజు, శివాజీ వర్మ, చాన్ భాష, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.