సత్వరమే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజలు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు, ఆహ్వాన పత్రికలు అందించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్