రైతన్న మీ కోసం: చంద్రబాబు నల్లజర్ల రాక, భారీ ఏర్పాట్లు

ఏలూరు జిల్లా నల్లజర్ల లో జరిగే 'రైతన్న మీ కోసం' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పిలుపు మేరకు, ద్వారకా తిరుమల మండలంలోని జి కొత్తపల్లి గ్రామం సొసైటీ చైర్మన్ రేగంటి రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం పలు గ్రామాల నుండి కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు భారీగా వాహనాల్లో ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్