పెదపాడు మండలం వట్లూరులోని శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబా వారికి విశేష పూజలు మరియు అభిషేకాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకున్నారు.