ఏలూరు జిల్లాలో డిసెంబర్ 4వ తేదీన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వంశీ చేతుల మీదుగా నూతన AISB టీమ్ నియమించబడింది. ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, కార్యకర్తల కృషి, నిబద్ధత, సేవాభావాన్ని పరిగణనలోకి తీసుకున్నారని నాయకత్వం ప్రకటించింది. నూతన సభ్యులు విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. AISB ఏలూరు జిల్లా అధ్యక్షుడు గుడుపూడి రోహిత్ కుమార్ మాట్లాడుతూ, ఈ కొత్త టీమ్ ద్వారా బలమైన కార్యకలాపాలు జరగనున్నాయని, జిల్లా విద్యార్థుల అభివృద్ధి, సంక్షేమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంస్థపై విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు టీమ్ సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు.