పెదపాడు: ఆటో బోల్తా పడి ప్రయాణికుడు మృతి

పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా సమీపంలో ఆటో బోల్తా పడిన ఘటనల ఏలూరుకు చెందిన అడపా వంశీ (25) మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక దాబాలో పనిచేసే వంశీ పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్