పెదవేగి మండలం వంగూరులో కోకో రైతు సదస్సు శనివారం నిర్వహించారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు లభించేలా ప్రత్యేక ఫార్ములా రూపొందించాలని కోరారు.