పెదవేగి: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

దెందులూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. మంగళవారం పెదవేగి మండలం దుగ్గిరాల పార్టీ కార్యాలయంలో ఆయనను పలు గ్రామాలకు చెందిన ప్రజలు కలిసి అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే వారి అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్