ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైన కూలీ మృతి చెందిన ఘటన పెదవేగి మండలం రామసింగవరంలో సోమవారం చోటుచేసుకుంది. పెదవేగి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన దిమ్మిటి చిన్నరాటయ్య 36 కూలి పనులు చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. సోమవారం పామాయిల్ తోటలో గలలు మెరుకుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఘటన స్థలంలోనే మృతి చెందాడు.