సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు కలపర్రు టోల్ ప్లాజా వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన టోల్ ప్లాజా పనితీరును పరిశీలించి, మూసి ఉన్న కారిడార్లను తెరిపించారు.