సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం కొప్పాక - అంకన్నగూడెం లాకుల వద్ద నుంచి పోలవరం రైట్ మెన్ కెనాల్ నీటిని రైతుల సాగునీటి ప్రయోజనార్ధం శుక్రవారం శాస్త్రోక్తంగా పూజలు చేసి నీటిని విడుదల చేశారు. కొప్పాక చెరువు, అంకన్నగూడెం, పినకడిమి, దుగ్గిరాల, అమ్మపాలెం సహా వట్లూరు దాకా ఉన్నటువంటి రైతాంగానికి నీటిని అందించడం జరుగుతుందన్నారు.