ఏలూరు జిల్లాలోని పెదపాడు, కలపర్రు, ఏపూరు విద్యుత్తు ఉప కేంద్రాల్లో మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ కె. అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా ఉప కేంద్రాల పరిధిలోని వినియోగదారులు గమనించి, సహకరించాలని కోరారు.