వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, దెందులూరు మాజీ శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి ఆదేశాల మేరకు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్ సిక్స్ మరియు బాండ్ లను దగ్ధం చేశారు.