దెందులూరు నియోజకవర్గంలోని గంగనిగూడెం, సానిగూడెం, గోపన్నపాలెం, తదితర గ్రామాల్లో సోమవారం సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే చింతమనేనికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.