కార్మిక సమ్మెకు ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ పిలుపు

కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ పిలుపునిచ్చాయి. ఏలూరులో జరిగిన సన్నాహక సదస్సులో నాయకులు మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక వర్గానికి ద్రోహం చేసిందని విమర్శించారు. ఈ నూతన చట్టాలు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్