పెదవేగి మండలం వేగివాడకు చెందిన అజయ్ (28), అభిలాష్ (16), సాగర్ (16) భీమడోలు మండలం లింగంపాడు గ్రామంలో బుధవారం ఓ శుభకార్యానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఇంటికి వెళుతున్నామని కుటుంబీకులకు చెప్పారు. నాచుగుంట సబ్ స్టేషన్ పక్కన ఉన్న కోమటిగుంట చెరువులో దిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.