ఏలూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

ఏలూరు వసంత మహల్ సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం ఏఐసీసీ, ఏపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ మాట్లాడుతూ, పేదల జీవనాధారమైన ఉపాధి హామీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించి, ప్రతి పేదవాడికి రావాల్సిన రాయితీలపై తగ్గింపు చర్యలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తున్నామని తెలిపారు. ఈ చర్యలు పేదల వ్యతిరేకమని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్