ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై యువతి కుటుంబసభ్యులు దాడి చేశారు. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న సాయిచంద్, దుర్గా పెద్దలు అంగీకరించకపోవడంతో ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు, బంధువులు సాయిచంద్‌ను స్తంభానికి కట్టేసి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అనంతరం దుర్గాను తీసుకెళ్లిపోయారు. సాయిచంద్ ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్, దాడి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దుర్గా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.