పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

ఉంగుటూరులో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని ఎంపీడీవో మనోజ్ విద్యార్థులకు సూచించారు. బుధవారం స్థానిక హైస్కూల్లో 94 మంది విద్యార్థులకు ఆర్నవ్ గ్రూప్స్ అధినేత మనోజ్ కుమార్ సొంకర్ పరీక్షా ఉపకరణాలు ఉచితంగా అందజేశారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించే ఉద్దేశ్యంతో ఈ సామగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బండారు సింధు మధుబాబు, ప్రధానోపాధ్యాయులు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్