గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ సాల్మన్ రాజ్ శుక్రవారం అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తితే ఏలూరు కంట్రోల్ రూమ్ 9440902926 లేదా, జంగారెడ్డిగూడెం 9491030712 నంబర్లలో సంప్రదించాలన్నారు.