ఏలూరు నగర శివారు ఆశ్రమం ఆసుపత్రి సమీపంలో గురువారం లారీ బోల్తా పడి 15 ఆవులు మృతి చెందాయి. విశాఖపట్నం వైపు నుంచి విజయవాడకు ఆవులతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న 31 గోవుల్లో 15 మృతి చెందాయని పశు వైద్య అధికారి డా. హరికృష్ణ తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.