ఏలూరులోని కోత్తపేటకు చెందిన 75ఏళ్ల సూర్యనారాయణమూర్తి అనే వృద్ధుడు వారం రోజులుగా ఏడో తరగతి చదివే బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. రోజు సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వెళ్లే బాలికను మచ్చిక చేసుకొని రోజూ కాసేపు ఇంటికి పిలిపించుకొని లైంగికంగా వేధిస్తున్నాడు. తల్లికి ఈ విషయం చెప్పడంతో ఆమె రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని వదిలేశారన్న పుకార్లపై బంధువులు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగగా తమ వద్దే ఉన్నాడు అని చెప్పటంతో శాంతించారు.