ఏలూరు: సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం

150 ఏళ్ల చరిత్ర కలిగిన ఏలూరు పడమర వీధి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. పిల్లలు సాయంకాలం పుస్తకాలు, పెన్నులు తెస్తే అమ్మవారి పూజలో పెట్టి ఇస్తారని జాతర కమిటీ సభ్యులు తెలిపారు. విద్యాబుద్ధులకు అధిదేవత అయిన సరస్వతి దేవిని దర్శించుకుని ఆమె కరుణాకటాక్షాలు పొందాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్