ఏలూరు జ్యూట్ మిల్ ఫ్లైఓవర్ పైనుండి ఒక పాసింజర్ ఆటో అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ గాయపడటంతో అతన్ని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.