ఏలూరులోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు సైబర్ నేరాలపై గురువారం ఏలూరు జిల్లా సైబర్ సెల్ సీఐ దాసు ఆధ్వర్యంలో సైబర్ సెల్ మహిళా ఎస్సై వల్లి పద్మ శ్రీ అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా ఎస్ఐ మాట్లాడుతూ. విద్యార్థులకు సైబర్ నేరాల ప్రభావం, ఆన్ లైన్ మోసాలు, సోషల్ మీడియా ప్రమాదాలు వాటి నుండి రక్షణ కోసం తీసుకోవాలసిన జాగ్రత్తల గురించి వివరించారు.