ఏలూరు: పేదలకు అండగా సీఎం సహాయనిది

ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం, ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 5. 74 కోట్ల సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ విడతలో 34 మందికి రూ. 12. 24 లక్షల చెక్కులు, 11 మందికి రూ. 24. 23 లక్షల విలువైన ఎల్‌ఓసీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్