ఏలూరు నగరంలోని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో లింగపాలెం మండలం ముదిచెర్ల గ్రామానికి చెందిన భారతి అనే మహిళకు ఆపరేషన్ నిమిత్తం చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమెకు అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరమైంది. దీంతో స్పందించిన ఏసీబీ కానిస్టేబుల్ పీతల కిషోర్ వసుంధర బ్లడ్ బ్యాంక్ ఏలూరు నందు 25వసారి రక్తదానం మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.