ఏలూరు జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2 నుంచి 6 వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, అభ్యర్థులు రూ. 600 అదనపు రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చని, ముఖ్యంగా పాత సిలబస్‌లో పదో తరగతి ఫెయిల్ అయిన వారికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.