గత నెల 24న దువ్వ-తేతలి మార్గ మధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందారు. ఈ వృద్ధురాలి వివరాలు తెలియాల్సి ఉంది.