మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ పట్టణాలు, కార్పొరేషన్లు లలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగుల లలో స్కిల్, సెమీ స్కిల్ గా గుర్తింపబడిన వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా కూడా వీరికి వేతనాలు రావడం లేదని అన్నారు.