ఏలూరు: గోదావరి నదికి శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే ముంపు ప్రభావo తో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ని కలెక్టర్ ఆదేశించారు. గోదావరి నదికి వరద ఉధృతి దృష్ట్యా ప్రజలెవ్వరూ నదిలోకి వెళ్లవద్దని, ఈతకు వెళ్లడను చేపలు పట్టడం వంటివి చేయవద్దన్నారు.