పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి 5,564 క్యూసెక్కుల జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు ఈఈ యేసుబాబు బుధవారం తెలిపారు. గోదావరి నీటిమట్టం 15 మీటర్లకు పైబడిఉండడంతో 16 మోటార్లు 16 పంపుల ద్వారా నీటి విడుదల చేసినట్లు తెలిపారు. కృష్ణా ఉమ్మడి పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల రీత్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోటార్లు, పంపుల సంఖ్య పెంచడం జరుగుతుందన్నారు.