అంతర్జాతీయ స్కేటర్, ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత జెస్సీ రాజ్ మాత్రపు, సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. దక్షిణ కొరియాలో జూలై 24 నుండి 29 వరకు జరిగిన 20వ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ 2025 నిర్వహించగా అందులో జెస్సీ పాల్గొన్నారు. శుక్రవారం జెస్సీని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రదాత చైర్మన్ రవి నాయుడు హృదయ పూర్వకంగా సత్కరించారు.