ఏలూరు టౌన్ పరిధిలో ఒక మహిళ అదృశ్యంపై భర్త ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నాగలక్ష్మి, రాటాలుకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి నుంచి నాగలక్ష్మి కనిపించలేదు. దీంతో భర్త చుట్టుపక్కల ప్రదేశాలతో పాటు బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.