ఏలూరు: బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితులకు జైలు

2019 ఫిబ్రవరి 13న పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన సమయంలో ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరికి బుధవారం న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతో పాటు రూ.3 వేలు జరిమానా విధించింది. ఎన్ఆర్‌పేటకు చెందిన సాయికుమార్, పత్తేబాదకు చెందిన దాసు బాలికకు అసభ్యకర సైగలు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తి వాణిశ్రీ శిక్ష విధించారు.

సంబంధిత పోస్ట్