ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన, స్పౌజ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు స్వయంగా పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లకు అదనంగా 686 పెన్షన్లను ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.