ఏలూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఏలూరు రూరల్ మండలం పెనుమాక లంక గ్రామానికి చెందిన సైదు వెంకన్న (47) మాదేపల్లి గంగానమ్మ గుడి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఆదివారం ఏలూరు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనారోగ్యంతో మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్