ఏలూరులోని అశోక్ నగర్ ఏటిగట్టు ప్రాంతానికి చెందిన తాపీ మేస్త్రీ కీర్తి సత్యనారాయణ (45) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంతో కలిసి జీవిస్తున్న అతను ఆర్థిక సమస్యలతో కొన్నిచోట్ల అప్పులు చేశాడని కుటుంబీకులు తెలిపారు. అవి తీర్చలేక మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.