2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏలూరు జిల్లాలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం మంత్రుల బృందంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం ఉన్న 20 ఘాట్లకు అదనంగా మరో 16 కొత్త ఘాట్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. పాత ఘాట్లలో రెండింటిని మరింత విశాలంగా తీర్చిదిద్దుతున్నామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని ఆమె వివరించారు.