ఏలూరులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం డీఎంహెచ్‌ఓ డా. అమృతం రాబోయే పల్స్ పోలియో కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 21న జరగబోయే ఈ కార్యక్రమంపై ఆమె పలు అంశాలను వివరించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శోభ టీకా భద్రపరిచే విధానం, బృందాల సమన్వయంపై మెడికల్ ఆఫీసర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ సమీక్షలో కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.