మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఏలూరు జిల్లాకు చెందిన దాసరి శ్యామ్ చంద్ర శేషు, బొమ్మాజీ అనిల్ టీడీపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విధంగా పనిచేస్తామని వారు తెలిపారు. ఈ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది.