గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని అమలు చేయని ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం పిసి అండ్ పి. ఎన్. డి. టి. యాక్ట్ అమలుపై అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. ఫిర్యాదుల కోసం 1800 4256 131 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.